ముంబై: బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారా మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు మరికొంత మంది
మాజీలు కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓ టీ20 టోర్నమెంట్ జరగనుంది. ఆ టోర్నమెంట్ లో దుమ్మురేపేందుకు ఈ మాజీలంతా సిద్ధమయ్యారు. సచిన్, లారాతో పాటు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ, శ్రీలంక బ్యాట్సమెన్ దిల్షాన్, సౌతాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ తదితరులు ఈ టోర్నమెంటులో పాల్గొననున్నారు. కాగా.. ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరి 2-16 మధ్య నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టోర్నీ భారత్‌లోనే జరగనుండటం మరో విశేషం.