ముంబై: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నియామకం దాదాపు ఖరారైనాట్లు తెలుస్తోంది. గంగూలీకి పోటీదారునిగా భావించిన బ్రిజేష్ పటేల్ అనేక చర్చల
అనంతరం పోటీ నుంచి తప్పుకొన్నాడు. నామినేషన్లకు ఈ రోజే ఆఖరి రోజు కావడంతో పోటీ అన్నదే లేకుండా కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ఇప్పటికే చర్చలు సాగాయి. దీంతో గంగూలీకి రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
కాగా... ఈ రోజు ఉదయం బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, బీసీసీఐ కోశాధికారి పదవికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.