పూణే: పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది. దీంతో మూడు
టెస్టుల సిరీసులో భారత్ మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్సులో 5 వికెట్ల నష్టానికి 601 పరుగులు చేసి డిక్లేర్ చేసిన భారత్ కు... దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏ దశలోనూ పోటీ నివ్వలేదు. తొలి ఇన్నింగ్సులో 275 పరుగులకే ఆలౌటైంది సఫారీలు, రెండో ఇన్నింగ్సులోను భారత బౌలర్లను ఎదుర్కొనలేక 189 పరుగుల వద్దే చాప చుట్టేశారు. దీంతో భారత్ భారీ విజయం కైవసం చేసుకుంది. కాగా... భారత బౌలర్లలో జడేజా, ఉమేష్ చెరో 3 వికెట్లు తీయగా... అశ్విన్ 2, షమీ, ఇషాంత్ శర్మ చెరో వికెట్ సాధించారు.