Print
Hits: 1038

పూణే: భారీ విజయం దిశగా భారత్ దూసుకెళుతోంది. భారత్, సౌతాఫ్రికా మధ్య పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి చేరువవుతోంది. భారత బౌలర్లు

మరో 3 వికెట్లు తీస్తే భారత్ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. భారత బౌలర్ల జోరుతో ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో భారీ పరాజయం అవడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా 51.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులతో నిలిచింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం క్రీజులో తోలి ఇన్నింగ్సులో రాణించిన ఫిలాండర్(19), మహారాజ్(3) ఉన్నారు. కాగా... భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్, ఉమేష్, షమీ తలో వికెట్ తీశారు.

e-max.it: your social media marketing partner