పూణే: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(4/69),
ఉమేశ్ యాదవ్(3/37), మహ్మద్ షమీ(2/44) దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. కాగా... ఇన్నింగ్స్ ఆఖర్లో భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహరాజ్(72: 132 బంతుల్లో 12ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు రాబట్టాడు. కేశవ్‌తో పాటు ఫిలాండర్(44: 192 బంతుల్లో 6ఫోర్లు) కూడా నిలదొక్కుకోవడంతో సఫారీ జట్టు ఆమాత్రం స్కోరైనా సాధించింది. దీంతో భారత్ కు 326 పరుగుల ఆధిక్యం లభించింది.