పూణే: పూణే టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్నా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో భారత్ 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల
వద్ద డిక్లేర్ చేసింది. సారధి విరాట్ కోహ్లీ 254 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి టెస్టుల్లో ఇది 7వ డబుల్ సెంచరీ కావడం విశేషం. మరోవైపు కోహ్లీకి అండగా నిలిచినా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔటయ్యాడు. కాగా... అయిదో వికెట్‌కు కోహ్లీ, జడేజాలు కలిసి 225 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మార్‌క్రమ్ ఉమేష్ యాదవ్ బౌలింగులో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఎల్గర్ ను కూడా ఉమేష్ యాదవ్ బోల్డ్ చేసి వెనక్కి పంపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 20/2 తో ఆడుతోంది..