Print
Hits: 852

పూణే: భారత సారధి విరాట్ కోహ్లీ మ‌రో రికార్డు బద్దలు కొట్టాడు. ఈ రోజు పూణే వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచులో భారీ శతకం సాధించిన కోహ్లీ అంత‌ర్జాతీయ

క్రికెట్‌లో 40 సెంచ‌రీలు చేసిన భార‌త సారధిగా నిలిచాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 26వ సెంచ‌రీ కాగా... ఈ సెంచరీతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచ‌రీల సంఖ్య మొత్తం 69కి చేరుకున్న‌ది. మరోవైపు స్వదేశంలో కోహ్లీకి ఇది 12వ టెస్టు సెంచ‌రీ. అయితే... మరో ఘనతకు కోహ్లీ చేరువలో ఉన్నాడు. సారధిగా ఇప్ప‌టి వ‌ర‌కు 40 సెంచ‌రీలు చేసిన కోహ్లీ... మొద‌టి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వెనుక ఉన్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్ 41 సెంచ‌రీలు చేశాడు. ఈ రోజు టెస్ట్ మ్యాచులో కోహ్లీ డబుల్ సెంచ‌రీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా... ప్ర‌స్తుతం భారత్ 138 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 462 ప‌రుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (189), జడేజా (19) ఉన్నారు.

e-max.it: your social media marketing partner