పూణే: పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆటను భారత్ ఘనంగా ముగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (14) త్వరగా వెనుదిరిగాడు. అయినప్పటికీ... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే.. ఆ వెంటనే రబడ బౌలింగ్‌లో డుప్లెసిస్ క్యాచ్ పట్టడంతో 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మయాంక్ కూడా పెవిలియన్ చేరాడు. పుజారా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ... రహానే తో కలిసి మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. ఆట ముగిసేటప్పటికీ భారత్ 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.