విశాఖపట్నం: టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఈ రోజు ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో శతక్కొట్టిన హిట్ మ్యాన్. సెకండ్
ఇన్నింగ్స్‌లోను శతకంతో చెలరేగాడు. కేవలం 133 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 100 మార్క్ చేరుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టులో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో సెంచరీ కాగా... ప్రస్తుత టెస్టులో రోహిత్‌కిది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అనంతరం 149 బంతుల్లో 10ఫోర్లు, 7 సిక్సర్లతో 127 పరుగులు సాధించి, కేశవ్ మహారాజ్ బౌలింగులో స్టంప్ అవుట్ గ వెనుతిరిగారు. కాగా... భారత్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.