విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ రోజు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో అలరించాడు. టెస్టుల్లో అతనికిది నాలుగో సెంచరీ, కాగా... ఓపెనర్‌గా
తొలి సెంచరీ. 154 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన హిట్ మ్యాన్, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలిసి తొలివికెట్ కు 200+ భాగస్వామ్యంతో దూసుకుపోతున్నారు. కాగా.. భారత్ ఇప్పటివరకు వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (115) మయాంక్ అగర్వాల్ (84) లు ఉన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు సఫారీలు బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు.