Print
Hits: 886
india vs sa 1 test match

విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ రోజు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ శుభారంభం చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు మంచి ఆరంభం ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కు 100 పరుగులు జోడించింది. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ 84 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్, మయాంక్.. ఇద్దరూ ఆచితూచి ఆడుతు వికెట్ నష్టపోకుండా తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అందివచ్చిన బంతినల్లా బౌండరీ వైపు తరలిస్తూ స్కోర్ బోర్డును భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.

e-max.it: your social media marketing partner