ఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రిటైర్మెంట్ అనేది పూర్తిగా ఆయన
వ్యక్తిగతమైనదని పేర్కొన్న గంభీర్.. తాను ధోని గురించి మాత్రమే మాట్లాడడం లేదని, దేశం గురించి మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు. సెలక్టర్లు భవిష్యత్తుపై దృష్టిసారించాలని సూచించాడు. ధోని ఆడాలనుకున్నంత వరకు ఆడొచ్చని, అయితే... చివరిగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించాడు. 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఆడడాన్ని తాను చూడకపోవచ్చని గంభీర్ అభిప్రాయబడ్డాడు. వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌కు సారథ్యం వహించేది కోహ్లీ అయినా, ఇంకొకరైనా ధైర్యంగా ఉండాలని సూచించాడు. వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు రిషభ్ పంత్, సంజు శాంసన్‌లు ఇద్దరూ అర్హులేనని వారితో పాటు యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్నాడు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఇప్పుడు భారత క్రికెట్.. ధోనీకి ఆవల ఆలోచించాల్సిన అవసరం ఉంది అని గంభీర్ వ్యాఖ్యానించాడు.