ఇంచియాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్‌వన్, జపాన్ స్టార్ షట్లర్ కెంటో మొమొట గెలుచుకున్నాడు. నిన్న జరిగిన సెమి ఫైనల్ లో
భారత ప్లేయర్ కశ్యప్ పై గెలిచిన మొమొట ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ తైన్ చెన్(తైవాన్)పై 21-19, 21-17తో విజయం సాధించాడు. 53 నిమిషాల పాటు సాగిన ఈ ఆఖరిపోరాటంలో మొమొట అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. కాగా... మొమొటకు ఇది కెరీర్లో 300వ విజయం కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి హీ బింజావో 18-21, 24-22, 21-17తో రచనోక్ ఇంతనాన్(థాయ్‌లాండ్)పై గెలుపొందింది.