ఇంచియాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కథ ముగిసింది. కొరియా ఓపెన్ లో సెమీస్ కు చేరిన తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్లో
తడబడ్డాడు. సెమీస్ లో జపాన్‌కు చెందిన కెంటో మొమొటా చేతిలో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. దీంతో కశ్యప్ ఫైనల్ కు వెళ్లకుండానే టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇక అద్భుత విజయం సాధించి ఫైనల్ బెర్త్ దక్కించుకున్న మొమొటా రేపు జరగనున్న ఫైనల్లో చైనీస్ తైపీ చౌ తియెన్ చెన్‌తో పోటీ పడనున్నాడు.