హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో గెలిచిన భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో
అజారుద్దీన్ ప్యానల్ గెలుపుకు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మాజీ క్రికెటర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో అజారుద్దీన్ గులాబీ కారెక్కుతారని సమాచారం. ఇదిలాఉంటే... అజారుద్ధీన్ ఇప్పటికే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే... అజార్ ఈ రోజు రాత్రికి గాని, లేదా రేపు గాని ప్రగతి భవన్‌కు వెళ్ళి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలవనున్నారని సమాచారం.