Print
Hits: 824

ఇంచియాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 24-22, 21-8తో

డెన్మార్క్ షట్లర్ జాన్ ఓ జోర్జెన్‌సన్‌పై విజయం సాధించాడు. కేవలం 37 నిమిషాల్లోనే జాన్ ఓను కశ్యప్ వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్ లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ గట్టిగ పోరాడిన కశ్యప్ ఆ సెట్ ను 24-22 తో గెలుచుకున్నాడు. అనంతరం రెండో సెట్ లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-8తో చిత్తుచిత్తుగా ఓడించాడు. కాగా... రేపు జరగనున్న సెమీస్‌ మ్యాచులో కెంటో మొమొటా(జపాన్)తో శనివారం తలపడనున్నాడు.

e-max.it: your social media marketing partner