హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ గెలుపొందాడు. అజారుద్దీన్ ప్యానెల్‌కు, ప్రకాష్ చందద్ జైన్
ప్యానెల్‌కు మధ్య రసవత్తరమైన పోటీ జరిగింది. అయితే... ఈ ఎన్నికల్లో ప్రకాష్ చందద్ జైన్‌పై 147 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్ విజయం సాధించారు. ఆయనకు 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. అర్జున్ యాదవ్, నిజాం క్లబ్, భారతి సిమెంట్స్ ప్యానెల్ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.