Print
Hits: 875
pv sindhu crashed out of the korea open

ఢిల్లీ: భారత బాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు కొరియన్ ఓపెన్‌ లో భారీ షాక్ తగిలింది. టోర్నీ ఆరంభంలోనే అమెరికాకి చెందిన జంగ్ బీవెన్‌పై 21-7, 22-24, 15-21 తేడాతో సింధు

ఓటమిపాలైంది. దీంతో ఆమె తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇక భారత్‌కి చెందిన మరో మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ ఈ రోజు మధ్యాహ్నం తొలి మ్యాచ్‌ ఆడనుంది.

మరోవైపు కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లోను భారత్ కు నిరాశ తప్పలేదు. భారత షట్లర్ బి.సాయి ప్రణీత్ కూడా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంటోన్సేన్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో్ గాయం కారణంగా ఆట నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. కాగా... అప్పటికే 9-21 తేడాతో తొలి రౌండ్ ఓడిపోయిన ప్రణీత్, రెండో రౌండ్‌లో కూడా 7-11 తేడాతో వెనుకబడ్డాడు. ఆ సమంయంలో గాయం తీవ్రత ఎక్కువవడంతో టోర్నీ నుంచి వెనుతిరిగాడు.

e-max.it: your social media marketing partner