హైదరాబాద్: వరల్డ్ బ్యాండ్మింటన్ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతాక విజేత పీవీ సింధూకి వి.చాముండేశ్వరినాథ్ బీఎమ్‌డబ్ల్యూ కారును బహూకరించారు. ఈ రోజు అన్నపూర్ణ
స్టూడియోలో ఏర్పాటు చేసినా కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతల మీదుగా బీఎమ్‌డబ్ల్యూ X5 మోడల్ కారును సింధూకి ఆయన అందజేశారు.
ఈ సంద్రాభంగా నాగార్జున మాట్లాడుతూ... సింధుకు తాను పేద అభిమానినంటూ ప్రశంసలు కురిపించారు. ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, అక్కడే ఫైనల్ మ్యాచ్ చూశానని చెప్పుకొచ్చారు. సింధు గోల్డ్ మెడల్ గెలవడం చాల సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా... చాముండేశ్వరినాథ్ ఇప్పటివరకు 22 మందికి కారులు బహుమతిగా ఇవ్వగా... అందులో 4 కార్లు సింధునే దక్కించుకోవడం విశేషం.