Print
Hits: 937

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆఫ్ఘన్

బౌలర్ల ధాటికి కేవలం 173 పరుగులకె ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ మొదటినుంచి బంగ్లా బ్యాట్స్‌మెన్ కట్టడి చేశారు. ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(41), షకీబ్ అల్ హసన్(44) కాసేపు పోరాడిన మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో జట్టును గెలిపించుకోలేకపోయారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ 6 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచాడు. మరో బౌలర్ జహీర్‌ఖాన్ 3 వికెట్లతో రాణించాడు.

అయితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టెస్టు కేరీర్‌లో రెండో విజయం నమోదు చేసినట్లయింది. ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోను ఆఫ్ఘన్ గెలిచింది.

e-max.it: your social media marketing partner