హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ టీ-20 కెప్టెన్ మిథాలీరాజ్ టీ-20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక
పరుగులు చేసిన ఘనత సాధించిన మిథాలీ... సుదీర్ఘకాలం భారత్ కు ప్రాతినిథ్యం వహించారు. కాగా... ఆమె టీ-20 నుంచి తప్పుకున్నప్పటికీ వన్డేలు, టెస్టుల్లో కొనసాగనున్నట్లు తెలిపారు. యువతులకు అవకాశం ఇచ్చేందుకే మిథాలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిథాలీరాజ్ ఇప్పటి వరకు భారత్ తరఫున 32 టీ-20మ్యాచ్‌లడారు. అందులో మూడు ప్రపంచకప్‌లు ఉండటం విశేషం.