ఢిల్లీ: భారత స్టార్ షట్లర్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఈ రోజు ప్రధాని మోడీని కలిశారు. విశ్వవిజేతగా నిలిచినా తరువాత స్వదేశానికి తిరిగి వచ్చిన
ఆమె ఢిల్లీలో ప్రధానితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పీవీని మోడీ అభినందించారు. పీవీ సింధు సాధించిన బంగారు పథకాన్ని మోడీ పీవీ మెడలో వేశారు. కాగా... సింధుతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, సీనియర్ కోచ్ గోపీచంద్, సింధు కోచ్ కిమ్ జి హ్యూన్ మోడీని కలిసిన వారిలో ఉన్నారు.