Print
Hits: 964
 pv sindhu gold medal

బాసెల్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో

సింధు విజయం సాధించి స్వర్ణ పతాకం గెలిచింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సింధు ఈ సారి అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి బంగారు పతాకాన్ని దక్కించుకుంది. ఈ రోజు జరిగిన తుదిపోరులో సింధు, జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను 21-7, 21-7 తేడాతో చిత్తుచేసింది. సింధు దూకుడుతో తొలి గేమ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. అదే జోరును రెండో గేమ్‌లోను కొనసాగించి మ్యాచ్‌ అలవోకగా సొంతం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో తడబడిన సింధు ఈ సారి ఛాంపియన్‌గా నిలిచి భారత్‌ గర్వపడేలా చేసింది.

e-max.it: your social media marketing partner