బాసెల్: చైనా షట్లర్లపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. దీంతో సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా
మూడోసారి ఫైనల్ చేరింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమి ఫైనల్ లో చక్కటి ప్రదర్శన చేసిన సింధు ఫైనల్ చేరి గోల్డ్ పతకాన్ని ఒక్క అడుగుదూరంలో నిలిచింది. సెమీస్‌లో 21-7, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీపై సింధు స్పష్టమైన ఆధిక్యంతో గెలిచింది. సింధు కేవలం 39 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచిత్తుచేసి వరుస గేమ్‌ల్లో గెలుపొంది తుదిపోరుకు దూసుకెళ్లింది.