ఢిల్లీ: ఇక భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలన్నారు టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడంపై
భారత్ మాజీ కెప్టెన్ గంగూలీ ట్విట్టర్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘భారత క్రికెట్లో ఇదో కొత్త ఫ్యాషన్. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం, వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి. బీసీసీఐ అంబుడ్స్‌మన్ ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చారు.’ అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. గంగూలీ ట్వీట్ కు హర్భజన్ సింగ్ సమర్ధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ద్రావిడ్ ను మించిన ఆటగాడు లేడని, కేవలం వారాల్లో నిలిచేందుకు ద్రావిడ్ కు నోటీసులు పాపారని భజ్జి రీ ట్వీట్ చేశాడు.