Print
Hits: 1304
india west indies t20 match

ఫ్లోరిడా: వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ సిరీస్ విజయంపై కన్నేసింది. నిన్న ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విజయం

సాధించిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. నేడు అదే స్టేడియంలో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే... భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

కాగా... మూడు వికెట్లతో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన పేసర్ నవ్‌దీప్ సైనీ ఈ మ్యాచుల్లోనూ ప్రతిభ చూపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరో వైపు భారత బ్యాట్సమెన్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ కూడా మేమే గెలుస్తామని సారధి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

e-max.it: your social media marketing partner