ముంబై: శ్రీలంక పేసర్ లసిత్ మలింగాపై ప్రశంసల వర్షం కురిపంచాడు భారత విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్సమెన్ రోహిత్ శర్మ. మలింగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు
గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ ట్విట్టర్ వేదికగా పొగడ్తల్లో ముంచెత్తాడు. '‘గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఒక మ్యాచ్ విన్నర్‌ను ఎంపిక చేయమంటే, అందులో మలింగ ముందు వరుసలో ఉంటాడు. ఓ కెప్టెన్‌గా ఉత్కంఠ పరిస్థితుల్లో తేలిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. భవిష్యత్తులో మలింగకు మరింత మంచి జరగాలి.’ అంటూ ముంబై ఇండియన్స్ జెర్సీతో ఉన్న మలింగా ఫోటోను జత చేస్తూ రోహిత్ ట్వీట్ చేశాడు.