జకర్తా: ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి చెందింది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్
టైటిల్ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్, జపాన్ షట్లర్ అకానె యమగూచి గెలుపొందింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస సింధుపై ఆది నుంచి ఆధిపత్యం చెలాయించింది. దీంతో వరుస గేములను కైవసం చేసుకొన్న యమగూచి సింధును చిత్తుచేసింది. కాగా... ఈ సీజన్లో సూపర్ సిరీస్ ఫైనల్లో ప్రవేశించడం సింధుకు ఇదే తొలిసారి. సెమీస్లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ చెన్ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా!. కానీ ఏకపక్షంగా సాగిన తుదిపోరులో యమగూచి టైటిల్ నెగ్గింది.