Print
Hits: 934
india tour of west indies

ముంబై: వచ్చే నెల నుంచి వెస్టిండీస్ లో పర్యటించనున్న భారత్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి మూడు

టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులను టీమిండియా ఆడనుంది. ఈ ఫార్మాట్లకు కావాల్సిన జట్టును ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచకప్ లో గాయ పడి టోర్నీ మధ్యలోనే వైదొలిగిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చాడు.

మూడు ఫార్మాట్ల టీమిండియా జట్లు:

టీ20 జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌,  శ్రేయస్‌అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్ పంత్‌ (వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

వన్డే జట్టు: విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌శర్మ (వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ.

టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

e-max.it: your social media marketing partner