లండన్: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో విశేషంగా రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్‌ను తయారు చేసింది. ఈ టోర్నమెంట్
టీమ్‌లో భారత్ నుంచి హార్డ్‌హిట్టర్ రోహిత్ శర్మ, యువ స్పీడ్‌స్టర్ బుమ్రాకు చోటు దక్కింది. అయితే... భారత సారథి విరాట్ కోహ్లీకి జాబితాలో స్థానం దక్కకలేదు. అయితే... ఈ టీమ్ కు కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా.. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని వికెట్ కీపర్‌గా ఐసీసీ సెలక్ట్ చేసింది.
టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..!
- జేసన్ రాయ్(ఇంగ్లాండ్)
- రోహిత్ శర్మ(భారత్)
- కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) (కెప్టెన్)
- జో రూట్(ఇంగ్లాండ్)
- షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)
- బెన్‌స్టోక్స్(ఇంగ్లాండ్)
- అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా) (వికెట్ కీపర్)
- మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
- జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్)
- ఫర్గుసన్(న్యూజిలాండ్)
- జస్ప్రిత్ బుమ్రా(భారత్)
- ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్, 12వ ఆటగాడు)