లార్డ్స్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తన దశాబ్దాలకలను నెరవేర్చుకుంది. క్రికెట్ పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ కు 'ఐసీసీ వరల్డ్ కప్ 12 వ సీజన్' లో తొలిసారిగా కప్
వరించింది. ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫెవరేట్ గ బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు జగజ్జేతగా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా... 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కూడా 241 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. స్టోక్స్, బట్లర్ చెరో ఫోర్ కొట్టి ఇంగ్లండ్ ఆశలకు ఊపిరి పోశారు. అనంతరం 16 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు నీశమ్ సిక్స్ కొట్టి మ్యాచ్ పెయిన్ ఆశలు రేపాడు. కానీ చివరి బంతికి రెండు పరుగులు అవసరంకాగా గప్తిల్ రనౌట్ కావడంతో కివీస్ సూపర్ ఓవర్ లో 15 పరుగులు చేసి మ్యాచ్ ను టై మల్లి చేసింది. అయితే.. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ జట్టు ఒక సిక్స్ కొట్టినప్పటికీ ఇంగ్లండ్ జట్టు రెండు ఫోర్లు కొట్టడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం అనే నిబంధన ప్రకారం ఈ వరల్డ్ కప్ ఇంగ్లండ్ జట్టునే వరించింది. దీంతో ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు తొలిసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.