లార్డ్స్: న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మధ్య జరగతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా... ఈ మ్యాచ్లో ఏ జట్టు
గెలిచినా చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీలలో ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు. రెండు జట్లు సమతూకంగా ఉండడంతో ఫైనల్ హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్టు సాగనుంది. కాగా ఏ జట్టు మ్యాచ్ గెలిచి తొలిసారిగా కప్ ను ముద్దాడుతుందో చూడాలి.