విరాట్ కోహ్లీ బిహేవియర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. బెంగళూర్ లో ఢిల్లీతో జరిగిన మ్యాచులో డ్రెస్సింగ్ రూమ్ పక్కకు తన గాళ్ ఫ్రెండ్ అనుష్క శర్మను పిలిచి చాలాసేపు మాట్లాడాడు. ఇది నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో కోహ్లీ ప్రవర్తనపై విమర్శలొస్తున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన కోహ్లీ, తాజాగా నిబంధనలను పక్కన పెట్టి ప్రియురాలికి సైగ చేసి పిలిచి మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గరకు క్రికెటర్లు తప్ప మిగతా వారు వెళ్లకూడదు..కానీ కోహ్లీ నిబంధనలు ఏమిం పాటిచలేదు.
గతంలో అనుష్క శర్మ గురించి మాట్లాడినప్పుడు కూడా తీవ్రంగా స్పందించాడు. దానిపై పలువురు స్పందిస్తూ.. కోహ్లీ తన తీరును మార్చుకోవాలని సూచించారు. దీనిపై సైకాలజిస్టులు విరాట్ కోహ్లీకు సూచన ఇస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో సన్‌రైజర్స్‌తో కీలక మ్యాచ్ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ కోహ్లీ దూకుడు స్వభావం, నోటి దురుసు మరోసారి చర్చకు దారితీసింది. ఆ మ్యాచ్‌లో వర్షం కారణంగా పిచ్ తడుస్తుండడంతో బెంగళూరు ఛేదనపై ప్రభావం చూపిస్తుందని కోహ్లీ ఆందోళన వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
కోహ్లీకి దినేష్ కార్తీక్ కూడా తోడవడంతో అది మరింత వివాదమైంది. కోహ్లీ సంయమనం కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే విరాట్ ఇలా నిగ్రహం కోల్పోవడం అతనికే చేటు అని అంటున్నారు సైకాలజిస్ట్‌లు. అభిమానులు, భారత క్రికెట్ కోసం కోహ్లీ టెంపర్‌ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, దుందుడుకు తనం వల్ల విరాట్‌పై వేటు పడితే టీమిండియాకు ఎంతో నష్టమని, విరాట్ ఆలోచించుకోవాలని చెబుతున్నారు.