భారత జట్టుతో పాటూ సహాయ సిబ్బందిలోనూ మార్పులు చేయాలని బిసిసిఐ భావిస్తోంది. టీమిండియా డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రి బదులు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైపు బిసిసిఐ చీఫ్ జగన్మోహన్ దాల్మియా మొగ్గు చూపుతున్నారు.
గంగూలీ రికార్డులను పరిగణలోకి తీసుకోన్న బీసీసీఐ.. ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్లకు కూడా బిసిసిఐలో మంచి పదవులు అప్పగించే వకాశం ఉంది. మరోవైపు రిటైర్మెంట్ అంచున ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లను తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం.