Print
Hits: 1750

శ్రీలంకను వాళ్ల గడ్డమీదే ఓడించి చరిత్ర సృష్టించింది పాకిస్తాన్. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ 2-1 తేడాతో  సిరీస్ కైవసం చేసుకుంది.

పల్లెకెలెలో జరిగిన మూడో టెస్టులో పాక్ సీనియర్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ అద్భుత సెంచరీ చేయడంతో లంకేయులు ఓడిపోక తప్పలేదు. నాలుగో ఇన్నింగ్స్ లో 377 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి పాకిస్తాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. చివరి టెస్టు నాలుగో రోజే... సెంచరీ చేసిన యూనిస్ ఖాన్... చివరి రోజు కూడా పట్టువదలకుండా ఆడాడు. సెంచరీ హీరో ఓపెనర్ షాన్ మక్సూద్  వెంటనే అవుట్ అయినా...కెప్టెన్ మిస్భావుల్ తో కలిసి యూనిస్  వంద పరుగులకు పైగా జత చేసి లంకేయులను ముంచాడు. 

లంక బౌలర్లను తెలివిగా ఫేస్ చేస్తూ... పాక్ కు మెమరబుల్ విక్టరీ అందిచాడు  యూనిస్. కెప్టెన్  మిస్భా కూడా బాధ్యతాయుతంగా ఆడిన  59 పరుగులు చేశాడు. 377 పరుగుల టార్గెట్ ను  కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో  విజయం సాధించింది పాక్ 271 బంతుల్లో 18 ఫోర్లతో 171 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు యూనిస్ ఖాన్. యూనిస్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలి టెస్టు పాక్ గెలవగా, రెండో టెస్టులో లంక విజయం సాధించింది. పల్లెకెలెలో జరిగిన మూడో టెస్టులో పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

 

e-max.it: your social media marketing partner