Print
Hits: 1669

వింబుల్డన్ లో పెను సంచలనం తప్పింది. టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ అతికష్టమ్మీద మూడో రౌండ్ దాటింది. బ్రిటన్ చిన్నది  హెదర్ వాట్సన్ ... నల్లకలువన ముప్పుతిప్పలు పెట్టింది. దాదాపు ఓడించినంత పని చేసింది. అయితే తన అనుభవాన్నంత రంగరించి పుంజుకున్న సెరెనా ఎట్టకేలకు  6-2, 4-6, 7-5 తో గెలిచి  ప్రి క్వార్టర్స్ కు చేరుకుంది.

 ఉత్కంఠ భరితంగా సాగిన మూడో రౌండ్ మ్యాచులో సెరెనాకు చెమటలు పట్టించింది వాట్సన్... తొలి సెట్ ను సెరెనా ఈజీగాగే గెలిచింది. 6-2 తో ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా  గెలవడంతో మ్యాచ్  త్వరగానే ముగిసేట్టు కనపడింది. కానీ సెకండ్ సెట్ నుంచి సెరెనాకు కష్టాలు మొదలయ్యాయి. అద్భుతమైన  క్రాస్ కోర్టు షాట్లు,  డ్రాప్ షాట్లతో అలరించిన వాట్సన్...రెండో సెట్లో... సెరెనా సర్వీస్ రెండు సార్లు బ్రేక్ చేసి 6-4 తో సెట్ గెలుచుకుంది. 

నిర్ణయాత్మక మూడో సెట్ లోనూ... వాట్సన్ దే హవా... ఒక దశలో  3-0 తో ఆధిక్యంలో ఉన్న  వాట్సన్ సులభంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే నాలుగో గేమ్ నుంచి  సెరెనా పోరాడింది. వాట్సన్ సర్వీస్ బ్రేక్ చేసి 3-3తో స్కోర్ సమం చేసింది. ఇక్కడ నుంచి మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒకరి సర్వీస్ ఒకరు బ్రేక్ చేసుకుంటూ పోవడంతో సెట్ టై బ్రేకర్ కు దారి తీసింది. టై బ్రేకర్ లోనూ హోరాహోరీ పోరే.... 5-3 తో సెరెనా ఆధింక్యలో నిలిచినా... వాట్సన్ మరోసార పోరాడి 5-5తో సమం చేసింది. ఈ టైమ్ లో తన అనుభవన్నాంత ఉపయోగించిన సెరెనా  వరుసగా రెండు పాయింట్లు సాధించి   మ్యాచ్ ఫినిష్ చేసంది. ..ఓడినా వాట్సన్ ఆకట్టుకుంది. మరో  మ్యాచులో మరియా షరపోవా...  రుమేనియా ప్లేయర్  బెగుపై  6-4, 6-3 తో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. మెన్స్ టాప్ సీడ్ నొవాక్ జాకోవిచ్... మూడో రౌండ్ లో ఘన విజయం సాధిచాడు.ఆసీస్ యు వ ప్లేయర్  టామిక్ పై 6-3, 6-3, 6-3తో సునాయాస విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ వావ్రింకా కూడా  నాలుగో రౌండుకు చేరుకున్నాడు. స్పెయిన్ ప్లేయర్  వెర్దాస్కోపై 6-4, 6-3, 6-4తో  విక్టరీ కొట్టాడు. 

 

e-max.it: your social media marketing partner