Print
Hits: 1819

రాజకీయాలు చేస్తూ తనను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని  పదే పదే ఆరోపిస్తున్న గుత్తా జ్వాల అనుకున్నది సాధించింది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. రియో ఒలిపింక్స్ లో పతకమే లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికి  కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనికి టార్గెట్  ఒలింపిక్ పోడియం ...

టాప్ అని పేరు పెట్టారు. ఇందులో  జ్వాలకు చోటు దక్కలేదు. ఇందులో ఉన్న ప్లేయర్లకు  శిక్షణతో బాటు, అందుకయ్యే ఖర్చు..ఇతర అలవెన్స్ లను ప్రభుత్వమే భరిస్తుంది. డబుల్స్ ప్లేయర్ అన్న కారణం చేత జ్వాలను ఇందులో చేర్చలేదు. అయితే తన పేరు లేకపోవడానికి  జాతీయ కోచ్ పుల్లెల గోపీచందే కారణమని ఆరోపించింది.  ఇటీవల కెనడా ఓపెన్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన జ్వాల, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసింది. 

కేసీఆర్ కు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన కేసీఆర్...వెంటనే ఈ విషయంపై  ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడలమంత్రి సర్బనంద సోనోవా ల్‌కు లేఖ రాశారు.  జ్వాల, అశ్వినీలకు ఈ పథకం వర్తించేలా వీలైనంత త్వరగా ఆదేశాలివ్వండి. వీళ్లు భారత్‌కు ఒలంపిక్ తెస్తారన్న నమ్మకం నాకుంది అని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్  అన్నారు. అంతేకాదు... రాష్ట్ర ప్రభుత్వం తరఫునా జ్వాలకు పూర్తి సహకారముంటుందని ప్రకటించారు సీఎం కేసీఆర్. అకాడమీ ఏర్పాటు చేయదలచుకుంటే అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లను తమ ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. మొత్తానికి గుత్తా జ్వాలా అనుకున్నది సాధించింది. తనపై కొందరు కుట్ర చేస్తున్నా... అది ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొంది. ఇదే ఊపులో రియో ఒలింపిక్స్ లో పతకం సాధిస్తే...ఇక జ్వాలాకు తిరుగుండదు. 

 

e-max.it: your social media marketing partner