ఐపీఎల్ మాజీ కమీషనర్ లలిత్ మోడీపై టీంఇండియా డేరింగ్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా ఫైర్ అయ్యాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న సురేష్ రైనా...ముడుపులు తీసుకున్నాడని లలిత్ మోడీ ఆరోపించాడు.
20 కోట్ల విలువ చేసే... ఫ్లాట్ ను ఢిల్లీలోని నోయిడాలో రైనా తీసుకున్నాడని మోడీ ట్వీట్ చేశాడు. రైనాతో పాటు రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో కూడా మ్యాచ్ ఫిక్సర్లే అన్నాడు. అయితే లలిత్ మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచాడు సురేష్ రైనా. తానేంటో అందరికి తెలుసు. నీతి తప్పి ఆడాల్సిన అవసరం తనకు ఎన్నడు పట్టలేదని రైనా. అన్నాడు. ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నిజాయితీగా ఆడుతూ...ఐపీఎల్లోనూ జట్టు గెలుపుకోసం హన్ రెడ్ పర్సెంట్ కష్టపడతా... అలాంటి నా పై ఆరోపణలు చేయడం తనను బాధించింది అని రైనా అన్నాడు.
క్రికెటర్‌గా తాను తప్పు చేయలేదనీ, తప్పుడు పనుల్లో భాగస్వామ్యాని కాలేదన్న రైనా.. లలిత్ మోదీపై పరువునష్టం దావా వేసే ఆలోచనతో ఉన్నాడు. తనపై అసత్య ఆరోపణలు చేసిన మోడీపై లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల మీడియాలో నాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా...నేనెప్పుడూ క్రీడాస్ఫూర్తికి, సమగ్రతకు కట్టుబడే ఆడాను. ఏ తప్పుడు పనుల్లోనూ నేను భాగస్వామిని కాలేదు. నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే. క్రికెట్ ఆడడం నా అభిరుచి అని రైనా బావోద్వేగంగా మాట్లాడాడు. రైనా, జడేజా విషయంలో బీసీసీఐ కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. వాళ్లెటువంటి తప్పుచేయలేదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తెలిపాడు.