Print
Hits: 1670

భారత్‌పై తొలిసారి సిరీస్‌ విజయంతో బంగ్లా చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుపై బంగ్లా మీడియా అతిగా స్పందిస్తోంది.

బంగ్లా ప్రముఖ పత్రిక ప్రోతమ్‌ అలో వీక్లీ మ్యాగజైన్‌ రోష్‌ అలోలో.. క్రీడాస్ఫూర్తిని మరచి టీమిండియాను అవమానించేలా ఓ వ్యంగ్యాత్మక ప్రకటనను ప్రచురించింది. అందులో ఆఫ్‌ కటర్‌లతో బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించిన యువ బౌలర్‌ ముస్తాఫిజుర్‌.. ఓ కటర్‌ పట్టుకుని ఉన్నాడు. అది అతని ఫేమస్‌ ఆఫ్‌ కటర్‌లను సూచించే విధంగా ఉంది. ‘టైగర్‌ స్టేషనరీ, మేడ్‌ బంగ్లాదేశ్‌, మిర్పూర్‌ స్టేడియం మార్కెట్లో ముస్తాఫిజుర్‌ కటర్‌ దొరుకుతుంది’ అని బోర్డులో రాసి ఉంది. కింద రహానె, రోహిత్‌ శర్మ, కోహ్లీ, ధోనీ, ధవన్‌, జడేజా, అశ్విన్‌లు అరగుండులతో ఓ బ్యానర్‌ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ బ్యానర్‌పై ‘మేం ఉపయోగించాం. మీరూ వాడండి’ అని రాసిఉంది. క్రీడా స్ఫూర్తిని మంటగలిపే ఇలాంటి వ్యంగ్య ప్రయోగాలు ఇరు దేశాల మధ్య స్పర్ధలకు కారణమవుతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా మీడియా కథనంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్దతి అంటూ బంగ్లా బోర్డును ప్రశ్నించింది. వెంటన క్షమాపణతో సవరణ వేయకపోతే...విషయం సీరియస్ గా ఉంటుందని బీసీసీఐ హెచ్చరించింది. వలర్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లా ఓడిపోయినప్పుడు కూడా బంగ్లా మీడియా ఇలానే చేసిందని. ఇక ఎంత మాత్రం ఊరుకోబోమని బీసీసీఐ పెద్దలు బంగ్లా బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. 

e-max.it: your social media marketing partner