రెండేళ్లుగా వర్కవుట్ చేస్తున్న డే అండ్ నైట్ టెస్టు ప్లాన్ ఈ ఏడాది వర్కవుట్ కానుంది. డే అండ్ నైట్ టెస్టు నిర్వహిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ లో దాయాది దేశం న్యూజీలాండ్ ...
ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ లో మూడు టెస్టులు జరుగుతాయి. తొలి టెస్టు బ్రిస్భేన్, రెండో టెస్టు పెర్త్ , మూడో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అడిలైడ్ లో జరుగుతుంది. అడిలైడ్ లో జరిగే చివరి టెస్టును డే అండ్ నైట్ టెస్ట్ గా నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
డే అండ్ నైట్ టెస్టులనేది వండర్ పుల్ ప్లాన్. మోడ్రన్ క్రికెట్ ఆడియన్స్ ను హలరిస్తాయి. డే అండ్ నైట్ టెస్టులకు మంచి ఆదరణ ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు చెబుతున్నారు. డే అండ్ నైట్ టెస్టులకు పింక్ కలర్ బంతులను వాడుతారు. ఫ్లడ్ లైట్ల వెలుతరులో పింక్ కలర్ బంతులు బాగా కనపడతాయని .. ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. డే అండ్ నైట్ టెస్టు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభమై.. రాత్రి 9.30 వరకు జరుగుతుంది. ఫస్ట్ సెషన్ అయిపోయాక 15 నిమిషాల టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత సెకండ్ సెషన్ ఉంటుంది. సెకండ్ సెషన్ ముగిసాక 40 నిమిషాల పాటు డిన్నర్ బ్రేక్ ఉండుంది. డిన్నర్ బ్రేక్ తర్వాత మూడో సెషన్ జరుగుతుంది. తొలిసారి జరిగే డే అండ్ నైట్ టెస్టు పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ సక్సెస్ అయితే... మరిన్ని దేశాలు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే అవకాశముంది. ఆసీస్- కివీస్ మధ్య డే అండ్ నైట్ టెస్టు జరుగుతుందని ఐసీసీ కూడా ధృవీకరించింది. ఐసీసీ కూడా ఈ టెస్టును ప్రత్యేకంగా పర్యవేక్షించనుంది.