Print
Hits: 1653

తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమికి ఆతిథ్య శ్రీలంక బదులు తీర్చుకుంది. రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో లంక 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసి..

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక అదగరొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి పాక్... తొలి ఇన్నింగ్స్ లో  కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయింది. అ తర్వాత బ్యాటింగ్ చేసిన లంక తన తొలి ఇన్నింగ్స్ లో 315 పరుగుల స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ పాక్ తడబడింది. అజహర్ ఆలీ సెంచరీ చేసినా... మిగతా బ్యాట్స్ మన్ విఫలం కావడంతో  పాక్ 329 పరుగులకే ఆలౌట్ అయింది.  దీంతో  శ్రీలంక ముందు కేవలం 153 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. 

ఆటకు ఆఖరి రోజును శ్రీలంక 153 పరుగుల లక్ష్యాన్ని లంక 26.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పో యి ఛేదించింది. లంక ఓపెనర్లు  కరుణరత్నే,  విటాంగే.. లంకకు శుభారంబాన్నిచ్చారు. విటాంగే 34 పరుగులు చేసి అవుటవగా... కరుణరత్నే 50 పరుగులు చేసి  పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కుమార సంగక్కర డకౌట్ అయ్యాడు... అయినప్పటికి కెప్టెన్ మాథ్యూస్ వేగంగా బ్యాటింగ్ చేశాడు.  తిరుమానేతో కలిసి లంకను విజయతీరాలకు చేర్చాడు.  మాథ్యూస్ 43 పరుగులు చేయగా, తిరుమానే  20 పరుగులు చేశాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో మా జట్టు బాగా ఆడిందని శ్రీలంక కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్  అన్నాడు. తొలి టెస్టులో గెలిచినా.. ఆధిక్యం నిలుపుకోలేకపోయాం..సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయాల్సింది...కానీ విఫలమయ్యాం అని పాక్  కెప్టెన్ మిస్భావుల్ హక్ అన్నాడు. ఈ మ్యాచులో మొత్తం 7 వికెట్లు తీసిన శ్రీలంక పేస్ బౌలర్ దమ్మిక ప్రసాద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

e-max.it: your social media marketing partner