Print
Hits: 1637

నాలుగేళ్ల తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు సంపాదించుకున్న భజ్జీ... ఈ ఆనందాన్ని  మాటల్లో వర్ణించలేను అని చెప్పాడు.

జింబాబ్వే టూర్ లో ఇరగదీస్తానని హర్భజన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టుకు కు ఎంపికైన హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. జింబాబ్వే పర్యటనకు భారత వన్డే జట్టులో హర్భజన్ సింగ్ స్థానం దక్కించుకున్నాడు.  భజ్జీ  సీనియర్ స్పిన్నర్ అయినా... ఐపీఎల్లో అతను బాగా ఆడాడు అందుకే అతనికి వన్డేల్లో చోటు కల్పించామని  సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ తెలిపాడు. బ్లూ జెర్సీ మళ్లీ ధరించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాటల్లో చెప్పలేను. 

క్రికెట్ ఆడటమే తనకు తెలుసునని, కెరీర్ మొదటి నుంచి తాను ఇలాగే ఉంటున్నానని హర్భజన్ తెలిపాడు. భారత జట్టు కోసం తాను సర్వశక్తులూ ఒడ్డుతా... క్రికెట్ కూడా ఓ విధంగా చదువులాంటిదే... పది నెలల తర్వాత వచ్చే వార్షిక పరీక్షల కోసం ఓ విద్యార్థి రాత్రింబవళ్లు చదువుతాడు...కానీ క్రికెటర్ కు మాత్రం నిత్యం పరీక్షనే అన్నాడు.ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌ను తాము మరో పరీక్షగా భావిస్తున్నామని చెప్పాడు. నేను దీని కోసం హార్డ్ వర్క్ చేస్తున్నా... ఆలోచనలు పంచుకోవడానికి తాను ఇష్టపడతానని చెప్పాడు. క్రికెట్ అనేది జీవితం లాంటిదన్నాడు. ఇక్కడ నేర్చుకోవడాన్ని ఆపవద్దన్నాడు భజ్జీ. 

e-max.it: your social media marketing partner