గుజరాత్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. వర్షాల కారణంగా మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుజరాత్ లోని గిర్ సోమ్ నాథ్, ఆమ్రేలీ, భావ్ నగర్, రాజ్ కోట్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది.