కర్ణాటక రాష్ట్రం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డు కోవడంలో ఏపి,తెలంగాణ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తే రాయలసీమ ప్రాంతం ఎడారి అవుతుందన్నారు. జనాభ ప్రాతిపదికన రాయలసీమకు నీటి కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి కేటాయింపుల విషయంలో చర్చలు జరుపుతున్నా... రెండు ప్రభుత్వాలు అక్రమ ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కృష్ణా జాలాలను పూర్తిగా కేటాయిస్తే సీమ సస్యశామలం అవుతుందన్నారు..రాయల సీమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 26 న జలసాధన దీక్ష చేపడుతునట్లు బైరెడ్డి తెలిపారు.