ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలను తెలిపారు. ఎందుకనుకుంటున్నారా నేడు రాహుల్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ ట్విట్టర్ ద్వారా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా రాహుల్ ట్విట్ చేస్తూ.. మీ ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు, శుభాకాంక్షలకు నా కృతజ్ఞతలని పేర్కొన్నారు.