అలహాబాద్ ప్రతాప్గఢ్లోని బాబాగంజ్ ప్రాంతంలోని గోయెల్ హోటల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 10 మంది సజీవదహనమైయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్య చికిత్స కోసం అలహాబాద్ తరలించాలని వైద్యులు సూచించారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.