వివిధ రంగాల్లో ధైర్య సాహసాలతో విధులు నిర్వహించే మహిళలకు ప్రదానం చేసే ఝాన్సీ లక్ష్మీ బాయి నారీ సమ్మాన్ అవార్డు CVR మహిళా జర్నలిస్ట్ కోమల్ సింగ్ ను వరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నుంచి కోమల్ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, భీకర వరదల సమయంలో కోమల్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి వార్తలను అందించారు.