జమ్మూ కాశ్మీర్ లో అటవి ప్రాంతంలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. పూంచ్ జిల్లాలోని చెంగడ్ ఏరియా నైషేరా సెక్టర్ లో ఈ అగ్ని ప్రయాదం సంభవించింది.
మంగళవారం అర్థరాత్రి దాటాక పాకిస్థాన్ ఏరియాలో రాజుకున్న అగ్ని.. క్రమంగా భారత భూభాగంగాలోకి వ్యాపించింది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో వాటిని ఆర్పే భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాటినే ఆర్పేందుకు ప్రయత్నించింది. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాదులే ఈ అగ్నిని పెట్టారని భారత సైన్యం అనుమానిస్తోంది. పాకిస్థాన్ దుశ్యర్యలకు బయపడేది లేదని...దాయాది దేశాన్ని ఆటలను తిప్పికొట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని... భారత అధికారులు స్పష్టం చేశారు.