నకలీ డిగ్రీ వివాదం కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.. న్యాయశాస్త్రంలో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ కేసులో అరెస్టైయిన జితేంద్రసింగ్ తోమర్ ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది..
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. న్యాయశాస్త్రంలో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారనే కేసులో అరెస్ట్ అయిన జితేంద్ర సింగ్ తోమర్....నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుతించింది. తోమర్ పత్రాలపై గతంలో అనుమానం వ్యక్తం చేసిన ఢిల్లీ బార్ కౌన్సిల్.. దీనిపై దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687తో పొందిన సదరు ఎల్‌ఎల్‌బీ పట్టా సైతం నకిలీదని సంబంధిత యూనివర్సిటీ కూడా తేల్చడంతో తోమర్ చిక్కుల్లో పడ్డారు. తోమర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది..
తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. ఆయన డిగ్రీ, ఎల్ ఎల్ బి పట్టాల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో ఆప్ .. మంత్రి వర్గంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న జితేంద్రసింగ్ తోమర్ తప్పని సరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.. అయితే తోమర్ ఉదంతంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆప్ నేతలు ప్రతిపక్షాలపై మండిపడ్తున్నారు.. జరుగుతున్న పరిణామాలు ఆప్ ప్రభుత్వంపై జరగుతున్న కుట్రగా ఆరోపిస్తున్నారు...