హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది జల ప్రళయ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తి అయింది. బియాస్ నది యమపాశంగా మారి 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.
గత ఏడాది జూన్ 8న జరిగిన జల ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజ్ఞాన విహార యాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. 48 మంది యాత్రకు వెళ్లగా అందులో 24 మంది విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. విద్యార్థులంతా రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వారు. ప్రమాద బాధితులైన 24మంది విద్యార్థుల కుటుంబాలు ఇప్పటికీ ఆ చేదు నిజం నుంచి బయటకు రాలేకపోతున్నాయి. అనుదినం వారి తలపులతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ప్రమాదం జరిగి ఏడాది పూర్తి కావడంతో ఇవాళ సాయంత్రం 6 గంటల 30నిమిషాలకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహితులు నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
https://www.youtube.com/watch?v=TF4A75Dxfp0